బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన నాగార్జున..!?

Anilkumar
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు ఆఖరి దశకు చేరుకుంది. 21 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో ఇప్పుడు ఏడు మంది ఉన్నారు . ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి పైమా ఎలిమినేట్ అయ్యింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా... అంతేకాదు మగవాళ్ళతో సరి సమానంగా పోటీపడి ఆడిన ఫైమా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటుందని అందరూ భావించారు.ఇక టిక్కెట్టు ఫినాలే శ్రీహన్ గెలుచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే .రేవంత్ రోహిత్ శ్రీహాన్ ఇనాయకు టాప్ 4 స్లోట్స్ ఖరారు అయిపోయింది. 

టాప్ ఫైవ్ స్లాట్ కోసం ఆదిరెడ్డి కీర్తి శ్రీ సత్యం పోటీ పడాల్సి ఉంది .అయితే ఈసారి ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది మొన్నటి వరకు అందరూ కూడా రేవంత్ విన్నర్ అని అన్నారు .అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా రోహిత్, రేవంత్ కి గట్టి పోటీ జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరికీ ఈ వారం ఓటింగ్ నువ్వా నేనా అనే రేంజ్ లో జరిగింది. వీళ్ళిద్దరితో పాటు ఇనాయ కూడా అదే రేంజ్ లో కొనసాగుతోంది .ఇక వీళ్ళ ముగ్గురిలో టైటిల్ ఎవరికి వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఈ షో విన్నర్ కి 50 లక్షల రూపాయలు ప్రైస్ మనీ ఇస్తారని మనందరికీ తెలిసిందే.

ఇక టాస్క్ లో  భాగంగా  ఆ ప్రైజ్ మనీని 38 లక్షలకు కుదిరించారు అని అందరూ అనుకోగా ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున టైటిల్ విన్నర్ కి క్యాష్ ప్రైస్ తో పాటు పాతిక లక్షల రూపాయలు విలువ చేసిన అందమైన ఇల్లుని బహుమతిగా కూడా ఇస్తానని బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ బంపర్ ఆఫర్ ను ఎవరు గెలుచుకుంటారు అనేది చూడాలంటే మరో రెండు వారాలు ఆడాల్సిందే... దీంతో ఇల్లు మరియు క్యాష్ ప్రైస్ ను ఎవరు గెలుచుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: