ఆఫర్స్ లేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!!

murali krishna
సినిమా అనేది ఒక అందమైన ప్రపంచం కానీ దానికి ఆకర్షితులై పరిశ్రమకు వచ్చే వారు వేలల్లో ఉంటారు. కానీ సక్సెస్ అయ్యేది పదుల సంఖ్యలో మాత్రమే ఉంటారు
ముఖ్యంగా హీరో, హీరోయిన్ కేటగిరీలో తీవ్ర పోటీ ఉంటుంది. అందం, టాలెంట్ తో పాటు అదృష్టం వున్న వాళ్ళకే స్టార్ హోదా దక్కుతుంది. కనీస హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి అమ్మాయిలు పెద్ద యుద్ధమే చేస్తారు. ప్రతిరోజు అనేక సవాళ్లు ఎదుర్కొంటారు. అలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన తెలుగు అమ్మాయి నందిని రాయ్.
బిగ్ బాస్ షోలో పాల్గొనే వరకు నందిని రాయ్ గురించి తెలిసిన వారు చాలా అరుదుగా ఉంటారు అని చెప్పొచ్చు. కారణం ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ అవి స్మాల్ బడ్జెట్ తో ఫేమ్ లేని దర్శకులు తీసిన చిత్రాలు. స్టార్ క్యాస్ట్ లేకపోతే జనాలు పట్టించుకోరు. నందిని పరిశ్రమకు వచ్చిన కొత్తలో నటించిన 040, హార్మోన్స్… ఎప్పుడు వచ్చి పోయాయో తెలియదు. ఆ సినిమాలు అసలు ఆడలేదు. ఆ టైం లో నందిని రాయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. ఇక నేను సక్సెస్ కాలేను అనే నిరాశలోకి జారుకున్నారట.
 బాగా తీవ్ర డిప్రెషన్ కు గురైన నందిని రాయ్… తన ఇంటి టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలి ఆని కూడ అమే అనుకున్నారట. సూసైడ్ ఆలోచనలు వస్తున్న క్రమంలో నందిని రాయ్ చికిత్స తీసుకొని ప్రమాదం నుండి బయటపడ్డారట మరీ. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో చెప్పి చేదు అనుభవాలు గుర్తు చేసుకుంది నందిని రాయ్. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న నందిని రాయ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆమె చాలా కామ్ గా ఉండేవారు. బిగ్ బాస్ గేమ్ కి తన నేచర్ సెట్ కాలేదని చెప్పాలి.
కొద్ది వారాలే ఉన్నప్పటికీ నందిని రాయ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నందిని రాయ్  మంచి మోడల్ గా నటిగా కొనసాగుతున్నారు. వచ్చిన సినిమా ఆఫర్స్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఎక్కువగా ఆమె డిజిటల్ సీరిస్లలో నటిస్తున్నారు. నందిని రాయ్ హై ప్రీస్ట్స్, షూట్ అవుట్ యట్ ఆలేరు, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్లలో నటించారు. మెట్రో కథలు అనే యంతలాజీ సిరీస్ చేశారు. సుధీర్ మోసగాళ్లకు మోసగాడు, అల్లరి నరేష్ సిల్లీ ఫెలోస్ చిత్రాల్లో నందిని రాయ్ హీరోయిన్  మంచి పాత్రలు చేశారు అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: