ఈవారం "ఓటిటి" ప్లాట్ ఫామ్ లో విడుదలకు రెడీగా ఉన్న తెలుగు సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈవారం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదలకు రెడీగా ఉన్నా తెలుగు సినిమాల గురించి తెలుసుకుందాం.
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీన జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

అల్లు శిరీష్ హీరోగా అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో సినిమా డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. ఈ మూవీ ని ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో డిసెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సంతోష్ శోభన్ హీరోగా పరియ అబ్దుల్లా హీరోయిన్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ డిజిటల్ హక్కులను సోనీ లీవ్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది  ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు సోనీ లివ్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద మూవీ "ఓ టి టి" హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: