అక్కడ ప్రమోషన్ లో భాగంగా 'పుష్ప 'టీం పెడ్తున్న ఖర్చు....!!

murali krishna
అల్లు అర్జున్ హీరో గా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఇప్పుడు మళ్లీ రిలీజ్ కి సిద్ధం అయింది. అయితే ఈసారి రష్యా దేశం లో పుష్ప సినిమా రిలీజ్ కాబోతుంది.తెలుగు లో మన ఇండియా లో విడుదలై సరిగ్గా సంవత్సరం కాబోతున్న సమయం లో రష్యన్ లాంగ్వేజ్ లో పుష్ప సినిమా విడుదల కాబోతుండడం అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏదో విడుదల చేశాం అంటే చేశాం అన్నట్లుగా కాకుండా పుష్ప సినిమా ను రష్యన్ లాంగ్వేజ్ లో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. హీరో, దర్శకుడు, హీరోయిన్, సంగీత దర్శకుడు, నిర్మాతలు ఇలా చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా రష్యాలోని మాస్కో లో సందడి చేస్తున్నారు.
గత మూడు నాలుగు రోజులుగా అత్యంత కీలక ప్రదేశాల్లో తిరుగుతూ సినిమా ను ప్రమోట్ చేయడం తో పాటు రష్యన్ మీడియా ముందు తమ సినిమా యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.రష్యా స్థానికులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమా రష్యన్ లాంగ్వేజ్ లో విడుదల చేయడానికి కాస్త ఎక్కువగానే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఖర్చు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రష్యా లో విడుదల చేయడానికి మరియు అక్కడ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ చేయడానికి ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మరి ఆ స్థాయిలో ఈ సినిమా అక్కడ కలెక్షన్స్ నమోదు చేయగలదా అంటే కచ్చితంగా అంతకు మించి చేస్తుంది అంటూ యూనిట్ సభ్యులందరికి ధీమా తో ఉన్నారు. అక్కడ ప్రమోషన్ ఖర్చు కాస్త ఎక్కువైనా కూడా కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో వస్తాయని అంటున్నారు. సినిమా కు మినిమం సక్సెస్ టాక్ దక్కితే చాలు ఈజీగా 20 నుండి 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ అక్కడి నుండి వచ్చి పడతాయని అంతా భావిస్తున్నారు. మరి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారి నమ్మకం ఎంత వరకు నిజమవుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: