"ఊర్వశివో రాక్షసివో" మూవీ అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి అల్లు శిరీష్ తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అల్లు శిరీష్ సరసన అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించింది. రాకేష్ శశి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లు లభించాయి.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగానే అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి ఆహా ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే డిసెంబర్ 9 వ తేదీ నుండి ఊర్వశివో రాక్షసివో  సినిమా ఆహా "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి. జీఏ 2 పిక్చర్స్‌, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్ రూపొందిన ఈ మూవీ లో వెన్నెల కిషోర్ ,  సునీల్ , ఆమని ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: