ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరంటే?

Satvika
బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే..గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ ను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది..కంటెస్టెంట్స్ సెలక్షన్ విషయంలో నిర్వాహకులు కాస్త కేర్ తీసుకోవాలని దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్రజంట్ నామినేషన్స్‌లో రేవంత్, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీసత్య,రోహిత్, ఫైమా 6 మెంబర్స్ ఉన్నారు. ఇక ఓటింగ్‌లో యధావిధిగానే రేవంత్ ముందున్నాడు. ఊహించని విధంగా ఫైర్ బ్రాండ్‌లా సెకండ్ ప్లేసులోకి దూసుకొచ్చాడు రోహిత్. మెరీనా వెళ్లిన తర్వాత అతడి ఆటతీరులో ఊహించని మార్పు వచ్చింది. ఎక్కడా తగ్గట్లేదు. తనకు శక్తికి మించి ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అందుకే వీక్షకులు రోహిత్‌కు మద్దతుగా ఓట్లు వేశారు. ఆదిరెడ్డి థర్డ్ ప్లేసులో ఉండగా.. కీర్తి నాలుగవ స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో శ్రీసత్య ఉంటే.. ఫైమా లీస్ట్ ఓటింగ్‌తో లాస్ట్‌లో ఉంది..గత వారం అమ్మడు బాగానే ఉంది..

గత వారం 'ఎవిక్షన్ ఫ్రీ పాస్‌'తో సేవ్ అయిన ఫైమా.. ఈసారి బయటకు వచ్చే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే ఫినాలేకు వెళ్లేది ఐదుగురే. కానీ ప్రజంట్ హౌస్‌లో 8 మంది ఉన్నారు. మిగిలి ఉన్నదేమో 2 వారాలు. అంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండాలి. లేదా ఒకరిని మిడ్ వీక్ అయినా చేయాలి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఫైమాతో పాటు శ్రీసత్య కూడా బయటకు వెళ్ళి పోతారు.

శ్రీసత్యకు బదులుగా ఆదిరెడ్డిని బయటకు పంపించే ప్లానింగ్ జరుగుతున్నట్లు ఉప్పు అందుతుంది. ఓటింగ్ అనేది లీస్ట్ బోదర్ ఇక్కడ. మీ ఓట్లకు విలువిచ్చి డిసైడ్ చేస్తే.. అక్కడ తమకు కావాల్సిన కంటెంట్ రాదు కాబట్టి.. పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ చూసి ఎవర్నీ ఉంచాలో, ఎవర్నీ పంపాలో డిసైడవుతారు. ఇది చాలామంది బహిరంగంగా చెబుతున్న విషయమే. అందుకే మేడమ్ శ్రీసత్యను సేవ్ చేసేందుకు.. కామన్ మ్యాన్ ఆదిరెడ్డికి స్కెచ్ వేసినట్లు ప్రచారం జరుగుతంది. ఇక విన్నర్‌గా మెచ్యూర్డ్ రేవంత్‌ని పంపేటప్పుడే డిసడయ్యారు అనుకుంట అంటున్నారు నెటిజన్స్..మొత్తానికి రేవంత్ విన్నర్ అవతాడని కొందరు అంటున్నారు.మరి ఎవరూ అవుతారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: