"హిట్ 2" బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు ఇప్పటికే ఈ సంవత్సరం మేజర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఇలా మేజర్ మూవీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరి ఈ మూవీ లో అడవి శేషు సార్ హీరోయిన్ గా నటించింది. నాచురల్ స్టార్ నాని ... వాల్ పోస్టర్ బ్యానర్ పై హిట్ ది సెకండ్ కేస్ మూవీ ని నిర్మించాడు.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నిన్న అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే పాజిటివ్ టాక్ రావడంతో , ఈ మూవీ కి  మొదటి రోజు భారీ ఎత్తున కలెక్షన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. ఇది ఇలా ఉంటే హిట్ ది సెకండ్ కేస్ మూవీ కి మంచి పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ జరపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్ లను రేపు సాయంత్రం 6 గంటలకు రామానాయుడు స్టూడియోస్ గ్రౌండ్స్ , ఫిలింనగర్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: