సూర్య బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ తీయనున్నారా..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య , మురుగదాస్ దర్శకత్వం లో తెరకెక్కిన గజిని మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని , అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య తన కెరియర్ లో నటించిన మూవీ లలో తనకు అద్భుతమైన పేరు  ప్రతిష్టలను తీసుకువచ్చిన  మూవీ లలో జై భీమ్ మూవీ ఒకటి. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి జ్ఞానవేలు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా జై భీమ్ సీక్వెల్ పై ఈ మూవీ యూనిట్ స్పందించింది. ఇటీవల జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో జస్టిన్ చంద్రు వాదించిన కేసుల్లో ఒకదాన్ని తీసుకొని జై భీమ్ మూవీ తీసాం. ఆయన వాదించిన మరిన్ని కేసులతో సీక్వెల్ లను కూడా తీయవచ్చు అని అన్నారు. దీనితో వారు జై భీమ్ మూవీ కి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే జై భీమ్ మూవీ లో సూర్య లాయర్ పాత్రలో నటించాడు. లాయర్ పాత్రలో సూర్య తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను , విమర్శకులను సైతం అద్భుతమైన రీతిలో మెప్పించాడు. ఈ మూవీ ద్వారా సూర్య కు అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం వహించిన జ్ఞానవేలు కు కూడా ఈ మూవీ ద్వారా గొప్ప గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: