"బద్రి" మూవీ రీ రిలీజ్ అప్పుడే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ లలో బద్రి మూవీ ఒకటి. బద్రి మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. పూరి జగన్నాథ్ "బద్రి" మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన రేణు దేశాయ్ , అమీషా పటేల్ లు హీరోయిన్ లుగా నటించగా , రమణ గోగుల ఈ మూవీ కి సంగీతం అందించాడు. రమణ గోగుల అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలకపాత్రను పోషించింది. 20 ఏప్రిల్ 2000 సంవత్సరంలో విడుదల అయిన బద్రి మూవీ ఆ సమయంలో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.
 

ఈ మూవీ తో పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన బద్రి మూవీ ని తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బద్రి మూవీ ని డిసెంబర్ నెలలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ ని ఏ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా మూవీ యూనిట్ మరి కొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రిలీజ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో రోజుల నుండి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: