ఫుల్ స్పీడ్ లో సుధీర్ బాబు "హంట్" మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సుధీర్ బాబు ఎన్నో మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం సుదీర్ బాబు , ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. కృతి శెట్టి ఈ మూవీ లో సుధీర్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సుధీర్ బాబు "హంట్" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా హంట్ మూవీ యూనిట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ఫుల్  స్పీడ్ లో జరుగుతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అలాగే హాలీవుడ్ సినిమా యాక్షన్ కొరియోగ్రాఫర్ లు హంట్ మూవీ కోసం ఫైట్స్ ను కంపోస్ట్ చేశారు అని చిత్ర బృందం తెలియజేసింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ మూవీ లో భరత్ , శ్రీకాంత్ ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ లో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: