"ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "లవ్ టుడే" మూవీ..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి ప్రదీప్ రంగనాథన్ తాజాగా లవ్ టుడే అనే తమిళ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రదీప్ రంగనాథన్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే లవ్ టుడే మూవీ తమిళ్ వెర్షన్ నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ లభించడం తో ఈ మూవీ తమిళ్ వెర్షన్ కు అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించాయి. దానితో ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన తెలుగు భాషలో విడుదల చేశారు.

తెలుగు లో కూడా ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. నెట్ ఫ్లిక్స్  "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో ఈ మూవీ ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 2 వ తేదీ నుండి తమిళ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా లవ్ టుడే మూవీ తమిళ్ వర్షన్ ను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి అనగా డిసెంబర్ 2 వ తేదీ నుండి ఈ మూవీ తమిళ వర్షన్ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది  చూసి ఎంజాయ్ చేయండి. మరి ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: