మొదటిసారి అదిరిపోయే రేంజ్ "టిఆర్పి" ని సొంతం చేసుకున్న "కార్తికేయ 2" మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ను కలిగి ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి నిఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ తాజాగా కార్తికేయ 2 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కార్తికేయ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మొదటి నుండే ఈ మూవీ పై తెలుగు సినీ అని ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ విడుదల ఆయన కార్తికేయ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకుంది. ఇలా థియేటర్ ప్రేక్షకులను మరియు "ఓ టి టి" ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కార్తికేయ 2 మూవీ కొన్ని రోజుల క్రితమే బుల్లి తెర పై కూడా ప్రసారం అయింది.

ఈ మూవీ సాటిలైట్ హక్కులను జి సంస్థ దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను జీ తెలుగు లో జీ సంస్థ ప్రచారం చేసింది. మొదటి సారి ఈ సినిమా బుల్లి తెర పై ప్రసారం అయినప్పుడు 7.88 "టి ఆర్ పి" ని సొంతం చేసుకుంది. కార్తికేయ 2 మూవీ కి మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇలా ఈ సినిమా థియేటర్ ప్రేక్షకులను "ఓ టి టి" ప్రేక్షకులను తాజాగా బుల్లితెర ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: