మహేష్ 28వ మూవీలో ఆ సీనియర్ స్టార్ హీరోయిన్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం మహేష్ బాబు "సర్కారు వారి పాట" మూవీ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండు మూవీ లు కూడా ప్రేక్షకులను బాగా అలరించడంతో వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ లో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటించినుండగా.,  శ్రీ లీల రెండవ హీరోయిన్ గా నటించబోతుంది. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ముగిసింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో అలనాటి కాలంలో ఎన్నో మూవీ లలో నటించి ఎంతో కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన శోభన ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ,  శోభన పాత్ర ఈ మూవీ కే హైలెట్ గా నిలవనున్నట్లు , అలాగే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: