ఈ వారం రిలీజ్ కు ఉన్న 4 తెలుగు సినిమాలు ఇవే... అంచనాలు అన్ని ఒక మూవీ పైనే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని మూవీ లు విడుదలకు రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం థియేటర్ లలో విడుదలకు రెడీగా ఉన్నా ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.
హిట్ : ది సెకండ్ కేస్ : అడవి శేషు హీరో గా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ మూవీ ఇప్పటికే విడుదల అయ్యి సూపర్ హిట్ అయినటు వంటి హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వల్ గా రూపొందింది. ఇది ఇలా ఉంటే హిట్ ది సెకండ్ కేస్ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సిని ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
మట్టి కుస్తీ : విష్ణు విశాల్ హీరో గా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. తమిళ్ భాషతో పాటు తెలుగు లో కూడా ఈ మూవీ విడుదల కానుంది. తమిళ్ లో ఈ మూవీ గట్టా కుస్తీ అనే పేరుతో విడుదల కారుంది.
నీవెవరు : ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.
దోస్తాన్ : ఈ మూవీ డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.
ఇలా రేపు అనగా డిసెంబర్ 2 వ తేదీన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 మూవీ లు విడుదల కాబోతున్నాయి. అందులో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకోగా , మట్టి కుస్తీ మూవీ పై పర్వాలేదు అనే రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: