ఆ సూపర్ హిట్ హారర్ సినిమాకు సీక్వెల్ ప్రారంభం అయింది..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి అజయ్ జ్ఞానముత్తు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు తమిళం లో రూపొందిన డిమాంటి కాలనీ అనే మూవీ తో తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ జ్ఞానముత్తు , చియాన్ విక్రమ్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన కోబ్రా మూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన కోబ్రా మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ జ్ఞానముత్తు తనకు ఎంతో గుర్తింపు ను తీసుకువచ్చిన డిమాంటి కాలనీ మూవీ కి సీక్వల్ ను రూపొందించడానికి రెడీ అయ్యాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను కూడా అజయ్ జ్ఞానముత్తు ప్రారంభించాడు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన డిమాంటి కాలనీ పార్ట్ 2 కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ మెయిన్ లీడ్ గా కనిపించబోతుంది.

ప్రస్తుతం ప్రియ భవాని శంకర్ తమిళ సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.  ప్రియ భవాని శంకర్ ఈ మధ్య విడుదల అయిన తిరు మరియు ఏనుగు మూవీ లలో నటించింది. ఈ రెండు మూవీ ల ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే డిమాంటి కాలనీ మూవీ మంచి విజయం సాధించడంతో , డిమాంటి కాలనీ పార్ట్ 2 పై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: