"ఆరెంజ్" మూవీ రీ రిలీజ్ పై స్పందించిన నాగబాబు..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు . ప్రస్తుతం రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించక పోయిbనప్పటికీ ఇప్పటికీ ఈ మూవీ టీవీ లలో ప్రసారం అయినప్పుడు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది .

ఈ మూవీ లో జెనీలియా హీరోయిన్ గా నటించగా , బొమ్మలిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు . నాగబాబు ఈ మూవీ ని నిర్మించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదల అయ్యి 12 సంవత్సరాలు పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని రీ రిలీజ్ చేయాలి అని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో నాగబాబు స్పందిస్తూ ... ఎప్పటికీ రిఫ్రెష్ చేసే సంగీతం , ప్రేమ కథ కలిగిన ఆరెంజ్ మూవీ ఎంతో మంది హృదయాల్లో చోటు దక్కించుకుంది. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు త్వరలోనే ఆరెంజ్ మూవీ ని రీ రిలీజ్ చేస్తాం అని నాగబాబు స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: