లైట్ గ్రీన్ కలర్ సారీ లో... వైట్ కలర్ బ్లౌస్ లో మెరిసిపోతున్న క్రేజీ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు ఎక్కువగా తమిళ సినిమాలలో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ సంవత్సరం విడుదల అయిన తిరు మూవీ తో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన తిరు మూవీ లో నిత్య మీనన్ హీరోయిన్ గా నటించగా , ప్రియ భవాని శంకర్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో తక్కువ నడివి ఉన్న పాత్రలోనే కనిపించినప్పటికీ తన నటన తో  , అందచందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలాగే హరి దర్శకత్వంలో అరుణ్ విజయ్ హీరోగా తెరకెక్కిన ఏనుగు మూవీ లో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గ నటించింది.
 

ఇలా ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే ప్రియ భవాని శంకర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దు గుమ్మ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రియ భవాని శంకర్ తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని , వైట్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ భవాని శంకర్ కు సంబంధించిన ఈ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: