ఆ రహస్యాన్ని ఆ తేదీన ప్రకటిస్తాను... కియారా అద్వానీ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కియరా అద్వానీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ సినిమాల ద్వారా మంచి గుర్తింపుని తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే తెలుగు లో కూడా భరత్ అనే నేను వినయ , విధేయ రామ అనే రెండు క్రేజీ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. న్యూజిలాండ్ లో రామ్ చరణ్ మరియు కియరా అద్వానీ లపై ఒక అద్భుతమైన సాంగ్ ను మూవీ యూనిట్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కనక బ్లాక్ బస్టర్ విజయం సాధించినట్లు అయితే కియారా అద్వానీ క్రేజ్ అమాంతం పన్ ఇండియా రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే కియరా అద్వానీ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ మల్హోత్రా తో ప్రేమలో ఉంది అని గతంలో అనేక వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అలాగే వీళ్ళిద్దరూ చట్టపట్టాలు వేసుకొని తిరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

కొన్ని రోజుల క్రితమే కాఫీ విత్ కరణ్ షో లో ఇన్ డైరెక్ట్ గా తాము లవ్ లో ఉన్నట్లు  కియరా అద్వానీ ప్రింట్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో కియరా అద్వాన ఓ పోస్ట్ చేసింది. ఈ రహస్యాన్ని ఇంకా ఎక్కువ కాలం దాచలేను. డిసెంబర్ 2 వ తేదీన ప్రకటిస్తాను. వేచి ఉండండి అని పోస్ట్ చేసింది. ఇది ప్రేమ మరియు పెళ్లి కోసమే అని నెటిజన్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: