సమంత ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్..వ్యాధికి మందు..

Satvika
స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే..మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆ వ్యాధి గురించి.. దాని తీవ్రత గురించి రకరకలా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ వ్యాధి తీవ్రతను తెలియజేస్తూ.. సహజసిద్ధంగా ఈ వ్యాధిని ఎలా నయం చేసుకోవచ్చో తెలియజేశారు ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు. మంతెన ఆరోగ్యాలయం ద్వారా ఎంతోమందికి సహజ పద్దతిలో రోగాలను నయం చేస్తున్న మంతెన సత్యనారాయణ రాజు ఈ మయోసైటిస్ వ్యాధిని ఎలా నయం చేసుకోవచ్చో తెలియజేశారు.


శరీరంలోని కండరాలకు వచ్చే పెద్ద సమస్యే ఈ మయోసైటిస్. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే.. మన శరీరంలోని రక్షక దళాలే.. శరీర కండరాల కణాలను పరాయి కణాలుగా భావించి వాటిపై దాడి చేస్తాయి. అలాంటి సందర్భంలో శరీరంలోని కండరాలు దెబ్బతింటాయి. శరీరంలోని తెల్లరక్తకణాలు విడుదల చేసే కెమికల్స్.. కండారాలపై ప్రభావం చూపిస్తుంటాయి.. దాని ప్రభావంతో మయోసైటిస్ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇలాంటి వ్యాధి లక్ష మందిలో 22మందికి వచ్చే అవకాశం ఉంది..అయితే వీరిలో కూడా ఒక్కొక్కరికి ఒక్కో లక్షణాలను చూపిస్తుంది..
*. వ్యాధిని తగ్గించడానికి ఎక్కువగా స్టెరాయిడ్స్ ఉపయోగిస్తారు. కానీ సహజసిద్ధంగా ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించుకునే పరిష్కారం కూడా ఉంది.

*. ఆవనూనె ముద్దకర్పూరం కలిపి దాన్ని వేడి చేసి ఆ వేడి నూనెతో మసాజ్ చేసుకుని వేడి నాళ్ల కాపడం పెట్టుకుంటే ఉపశమనం ఉంటుంది. కండరాలకు చాలా రిలీఫ్ ఇస్తుంది.

*.  ఏ భాగంలో అయితే నొప్పి ఎక్కువగా ఉందో.. అక్కడ వేడి కట్లు కట్టుకుని కాపడం పెట్టుకోవాలి.

*. వేడి నీళ్ల స్నానం చేస్తూ ఉండాలి.

ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది..

*. అవిసెగింజల్ని దోరగా వేగించి తీసుకోవడం మంచిది. వాల్ నట్స్ కూడా బాగా మంచిది.

*. బీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. బీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉండే ఆహారం ఏదీ అంటే.. వరి తవుడు. తవుడు ఉండల్ని తినడం.. కూరల్లో వేసుకోవడం. పుల్కా పిండిలో కలుపుకుని.. లేదంటే నీళ్లలో కలుపుకుని ఇలా తవుడుని తీసుకోవాలి. ఈ వ్యాధిని తగ్గించే పోషకాలు తవుడులో ఎక్కువు ఉంటాయి.

*. ఉప్పులేని ఆహారం తీసుకుంటే కండరాల నొప్పిలు తొందరగా తగ్గుతాయి. ఉప్పు తినడం మానేస్తే.. మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడొచ్చు.

*. రాత్రి పూట డ్రై ఫ్రూట్స్ తీసుకుని వండిన ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే చాలామంచింది.

*. ఉదయం పూట వీట్ గ్రాస్ (Wheat Grass Juice) తాగితే మంచిది. 150 ML, 250 ML చొప్పున రోజూ తాగితే చాలామంచిది. ఈ జ్యూస్ తాగితే రక్త ప్రసరణలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది.

*.  ఈ జ్యూస్ తాగిన తరువాత.. రెండు మూడు రకాల మొలకలు, ఫ్రూట్స్ తీసుకోవాలి.

*.ఈ నేచురల్ డైట్ వల్ల మన రక్షణ వ్యవస్థ మన శరీర కండరాలపై దాడి చేయడం ఆపేస్తుంది. ఇలా చేస్తూ.. ఫిజియోథెరపీ చేయించుకుంటే తొందరగా కోలుకుంటారు. ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్న వాళ్లలో మానసిక ఒత్తిడి ఉండకూడదు.

*. ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను ఎంచుకోవాలి..అందుకే యోగా వంటి వాటిని క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి..
ఈ విధమైన వాటిని సక్రమంగా పాటిస్తే మాత్రం ఆ భయంకరమైన వ్యాధి నుంచి బయట పడవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: