బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ లో మైమరపిస్తున్న ప్రియ భవాని శంకర్..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటు వంటి ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఎక్కువ శాతం తమిళ సినిమాలలో నటించి తమిళ మూవీ ల ద్వారా అద్భుతమైన గుర్తింపును దక్కించుకుంది. ప్రియ భవాని శంకర్ తాజాగా సూపర్ హిట్ అయినటువంటి తమిళ సినిమా తిరు లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది.
 

అలాగే అరుణ్ విజయ్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఏనుగు మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ , ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ తన నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీ లో వరస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ప్రియ భవాని శంకర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రియ భవాని శంకర్ తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ని ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియ భవాని శంకర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: