బాస్ పార్టీ నుంచి మరో ట్రీట్..మెగా ఫ్యాన్స్ కు పూనకాలే..

Satvika
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు.. గాడ్‌ఫాదర్‌ సినిమా తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న చిరు. ఇప్పుడు మరో సినిమా లో నటిస్తున్నాడు. తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి 'బాస్ పార్టీ' అంటూ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేయగా, దానికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్‌గా కంపోజ్ చేయగా, ఇందులో మెగాస్టార్ చాలా రోజుల తరువాత పక్కా మాస్ అవతారంలో కనిపించాడు..

ఈ పాట లో బాలివుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఈ మాస్  బాస్‌తో కలిసి చిందులు వేసింది. ఇక ఈ లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా దూసుకుపోతుంది. ఈ సాంగ్‌ను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ పాటకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ పాటకు ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతుండటంతో, దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆదివారం రోజున బాస్ పార్టీ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుందట..

అయితే, దీనికి సంబందించి అఫిసియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు..చిత్ర యూనిట్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.ఈ సినిమాలో ఊరమాస్ అవతారంలో చిరు కనిపిస్తుండగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, మాస్ రాజా రవితేజ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు..ఈ  సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల అయిన అన్నీ కూడా భారీ అంచనాలను పెంచుతున్నాయి.దీంతొ ఈ సినిమా కూడా భారీ హిట్ ను అందుకుంటుందని మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: