నాగ చైతన్య కోసం ఆ బ్యాక్ డ్రాప్ లో కథను తయారు చేస్తున్న పరుశురామ్..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి నాగ చైతన్య ప్రస్తుతం పరుస మూవీ లలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే నాగ చైతన్య ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా నాగ చైతన్య ఈ సంవత్సరం బంగార్రాజు మూవీ లో నాగార్జున తో కలిసి నటించాడు. ఆ తర్వాత థాంక్యూ మూవీ లో సోలో హీరో గా నటించాడు. ఆ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తలకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న నాగ చైతన్య , ఈ వెబ్ సిరీస్ తో పాటు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తేరకేక్కుతున్న కస్టడీ అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. కస్టడీ మూవీ లో నాగ చైతన్య పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలా వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య , పరశురామ్ దర్శకత్వం లో కూడా ఒక మూవీ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకే ఓ మూవీ తెరకే. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ స్టార్ట్ కాలేదు.  ప్రస్తుతం దర్శకుడు పరుశురామ్ , నాగ చైతన్య కోసం అద్భుతమైన కథను తయారు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం పరుశురామ్ , నాగ చైతన్య కోసం ఒక బ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో కథను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పరుశురామ్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తరికెక్కిన సర్కారు వారి పాట మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: