హంట్: వామ్మో.. సుధీర్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్?

Purushottham Vinay
హంట్: టాలీవుడ్  టాలెంటెడ్  హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'హంట్'. ఈ సినిమాకి మహేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ రేంజ్ లో ఈ మూవీని వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. శ్రీకాంత్  ఇంకా 'ప్రేమిస్తే' భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్  కూడా పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఇక ఇదిలా వుంటే హై వోల్టేజ్ కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు మెయిన్  హైలైట్ గా నిలవనున్నాయట.


ఇక ఈ యాక్షన్  ఎపిసోడ్స్  కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు అనేవి చాలా స్పెషల్ గా వుండనున్నాయట. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో వుంటాయని సమాచారం తెలుస్తోంది., జాన్ విక్, మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన ఫైట్ మాస్టర్లను 'హంట్ ' సినిమా కోసం యాక్షన్ ఘట్టాలని కంపోజ్ చేశారట.ఇక ఇవి సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని సమాచారం తెలుస్తుంది. 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో ఫ్లాప్ ని ఎదుర్కొన్న సుధీర్ బాబు 'హంట్' సినిమాతో మాత్రం ఎలాగైలా మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో వున్నాడు. దీంతో 'హంట్' సినిమాకు సంబంధించిన ప్రతీ విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడట. ఆ కారణంగానే 'జాన్ విక్' మూవీకి స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో కళ్లు చెదిరే యాక్షన్ సీన్స్ ని కంపోజ్ చేయించాడని చెబుతున్నారు.మరి ఈ మూవీ ఎంత పెద్ద హిట్  అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: