మహేష్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన అడవి శేషు..!!

Divya
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజాగా యువ హీరో అడవి శేషు ఎవరికీ తెలియని విషయాన్ని బయట పెట్టడం జరిగింది. ఈ ఏడాది మహేష్ బాబు జీవితంలో చాలా చీకటి రోజులు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మహేష్ కు ఇష్టమైన అన్నయ్య రమేష్ బాబును కోల్పోవడమే కాకుండా ఆ బాధ నుంచి తీరుకోకముందే తన తల్లి ఇందిరా దేవి కన్నుమూయడం జరిగింది. ఆ బాధ నుంచి కోలుకునే లేపు తన తండ్రి కూడా మరణించారు. ఇలా వెంట వెంటనే నెలల తినకుండనే ముగ్గురు ఇష్టమైన వ్యక్తులను కోల్పోవడంతో మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి
ఈ ఏడాది తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులను కోల్పోవడంతో మహేష్ తట్టుకోలేకపోయారని ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా చాలా బాగోద్వేగానికి గురవుతున్న మహేష్ ఫోన్ కాల్స్ ని పట్టించుకోవడంలేదని భార్య నమ్రతతో మాత్రమే మాట్లాడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హీరో అడవి శేషు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేశారు. అడవి శేషు నటించిన హిట్ -2 సినిమా రిలీజ్ నేపథ్యంలో ఒక మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

అడవి శేషు మాట్లాడుతూ మహేష్ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి గురించి ఆయన మానసిక వేదన గురించి వెల్లడించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మేజర్ సినిమా సమయంలో మహేష్ ఫ్యామిలీకి అడవి శేషు బాగా దగ్గరయ్యారు. ఆ చనువుతోనే మహేష్ తాజా పరిస్థితి నమ్రతాన్ని అడిగి తెలుసుకున్నాడట. మహేష్ సార్ ప్రస్తుతం అనుభవిస్తున్న బాధ వర్ణించలేనిది ఎవరికి కూడా ఇలాంటి బాధ రాకూడదని మహేష్ కు మానసిక ధైర్యాన్ని ఆ దేవుడు అందించాలని తెలియజేశారట. ముఖ్యంగా మహేష్ బాబు ఫోన్ కాల్స్ ని అవాయిడ్ చేస్తున్నారని నేను మాత్రం నమ్రత గారితో టచ్ లో ఉన్నానని ప్రస్తుతం మహేష్ ఎదుర్కొంటున్న బాధను చూసి తనకి చాలా బాధేసిందని తెలియజేశారు అడవి శేషు. అడవి శేషు ఇలా తెలియజేయడంతో మహేష్ ఫ్యాన్స్ చాలా బాగా ద్వేగానికి లోనవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: