పవన్ కళ్యాణ్ తో జాతిరత్నాలు దర్శకుడి సినిమా..!?

Anilkumar
కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన కె.వి.అనుదీప్ దర్శకుడిగా మారి 'పిట్టగోడ' అనే సినిమా చేశాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ రెండో మూవీ 'స్వప్న సినిమా' వంటి పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అదే 'జాతి రత్నాలు'.అయితే  ఈ మూవీ లాక్ డౌన్ తర్వాత అంటే 2021 మార్చిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అంతేకాకుండా పెట్టిన రూపాయికి 5 రూపాయల ప్రాఫిట్ ను అందించింది ఈ మూవీ.ఇక దీంతో ఒక్కసారిగా అనుదీప్ క్రేజీ హీరోగా మారిపోయాడు.

అయితే  ఆ వెంటనే ఏకంగా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ ను హీరోగా పెట్టి 'ప్రిన్స్' అనే మూవీ చేసేశాడు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.ఇదిలావుంటే  మరోపక్క అనుదీప్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' కూడా పెద్ద ప్లాప్ అయ్యింది.అయితే  దీంతో ఈ దర్శకుడి ఫ్యూచర్ సంగతి ఏంటి అనే డౌట్ అందరిలోనూ ఉంది. అయితే ఇక  'ప్రిన్స్' రిజల్ట్ అనుదీప్ కెరీర్ ను ఏమీ స్పాయిల్ చేయలేదు.ఇదిలావుంటే ఇక ఇతనితో సినిమాలు చేయడానికి పెద్ద నిర్మాణ సంస్థలు రెడీగా ఉన్నాయి.అయితే  'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' 'సితార ఎంటర్టైన్మెంట్స్' వంటి

బడా బేనర్లలో ఇతను సినిమాలు చేయాలి. అంతేకాకుండా 'స్వప్న సినిమా' బ్యానర్లో ఇంకో సినిమా చేయడానికి కూడా 'జాతి రత్నాలు' టైంలోనే సైన్ చేశాడట అనుదీప్. ఇక ఇదిలా ఉండగా.. అనుదీప్ కు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం.అందుకే చాలా రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ కోసం ఓ మంచి కథను అనుకున్నాడట. అయితే  ఇక మనోడు ఇంకా పవన్ కళ్యాణ్ కు కథ వినిపించలేదు.అయితే ఒకవేళ కథ చెప్పి ఒప్పించినా.. ముందుగా ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసేవరకు.. అనుదీప్ సినిమా పట్టాలెక్కించే ఆస్కారం కూడా లేదు. కానీ  ఇక  అనుదీప్ మాత్రం సిన్సియర్ గా ట్రై చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: