"హిట్ 2" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ మరియు వేదిక ఖరారు..!

Pulgam Srinivas
క్షణం మూవీ తో సోలో గా బ్లాక్ బస్టర్ మూవీ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందుకున్న అడవి శేషు ప్రస్తుతం వరస మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. క్షణం మూవీ తో సోలో హిట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అడవి శేషు ఆ తర్వాత గూఢచారి , ఎవరు తాజాగా ఈ సంవత్సరం మేజర్ లాంటి వరస విజయవంతమైన మూవీ లతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం మేజర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అడవి శేషు ఈ సంవత్సరం మరో మూవీ తో ప్రేక్షకులను  పలకరించడానికి రెడీ అయ్యాడు.
 

తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో అడవి శేషు హీరోగా నటించాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన గ్రాండ్ గ థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ తగరపడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి టీజర్ మరియు ట్రైలర్ ను చిత్ర  బృందం విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 28 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్ , ఫిలిం నగర్ , హైదరాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: