అవకాశం వస్తే ఆ టాలీవుడ్ స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటా... కృతి సనన్..!

Pulgam Srinivas
అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కృతి సనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృతి సనన్ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే కృతి సనన్ ఈ మూవీ లో తన నటన తో అంద చందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. వరుస హిందీ మూవీ లలో నటిస్తూ ప్రస్తుతం కృతి సనన్ కెరియర్ లో ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది.  

కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా కృతి సనన్ "తోడేలు" అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఈ రోజు అనగా నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కృతి సనన్ ఓ టీవీ డిబేట్ లో పాల్గొంది. ఆ టీవీ డిబేట్ లో భాగంగా యాంకర్ కృతి సనన్ ను కార్తీక్ ఆర్యన్ ,  టైగర్ ష్రాఫ్ , ప్రభాస్ లలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తారు ... ఎవరితో డేట్ చేస్తారు ... ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు కృతి సనన్ కార్తీక్ ఆర్యన్ తో ప్లాటింగ్ చేస్తాను. టైగర్ తో డేటింగ్ చేస్తాను. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అని కృతి సనన్ సమాధానం ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి సనన్ , ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఆది పురుష అనే పాన్ ఇండియా మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: