తండ్రిని తలచుకొని మహేష్ ఎమోషనల్ ట్వీట్.. వైరల్?

Purushottham Vinay
ఇండియన్  సినిమా ఇండస్ట్రీ గర్వపడే హీరో టాలీవుడ్ సూపర్ స్టార్  రియల్  లెజెండ్  కృష్ణ  గారి మరణ వార్త విని.. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు అంతా కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో కృష్ణ గారు మరణించిన సంగతి తెలిసిందే.అయితే ఒకే సంవత్సరంలో అన్నని, తల్లిని ఇంకా తండ్రిని కోలుపోయి సూపర్  స్టార్  మహేష్ బాబు కుదేలై పోయాడు. తీవ్ర శోకంలో ఉన్న మహేష్ బాబుని చూసి ప్రతి ఒక్కరి మనసు కూడా ఎంతగానో కరిగిపోయింది. ఆ శోకం నుంచి మహేష్  బాబు త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్ధనలు చేశారు.తాజాగా తండ్రి కృష్ణ గారి మరణం తరువాత మొదటిసారి మహేష్, కృష్ణ గారి గురించి ట్వీట్ చేశాడు. 'మీ మరణం కూడా మీ జీవితంలా చాలా గొప్పగా ముగిసింది. డేరింగ్ అండ్ డాషింగ్ స్వభావంతో మీరు మీ జీవితాన్ని ఎలాంటి భయం లేకుండా చాలా నిర్భయంగా గడిపారు. నా ఇన్స్పిరేషన్, నా ధైర్యం ఇంకా మీలో కనిపించే ఎన్నో గొప్ప లక్షణాలన్నీ కూడా మీతో పాటు అలాగే వెళ్లిపోయాయి. 


కానీ విచిత్రంగా నేను మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా ఫీల్ అవుతున్నాను.ఇంతకు ముందెన్నడూ అనుభవించని ఈ బలాన్ని నాలో నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. మీ వెలుగు నాలో ఎప్పటికీ కూడా ప్రకాశిస్తుంది. మీ లెగసీని మీలాగానే ముందుకు తీసుకువెళ్తాను. మీరు ఇంకా మరింతగా గర్వ పడేలా చేస్తాను. లవ్ యూ నాన్నా.. మై సూపర్ స్టార్' అంటూ మహేష్  చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆయన అభిమానులు స్ట్రాంగ్ ఉండన్న మీకు మేము వున్నాము అంటూ మహేష్ ట్వీట్ ని లైక్ చేస్తూ రీట్వీట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్  శ్రీనివాస్  దర్శకత్వంలో తన 28 వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్   దశలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: