బాలయ్య అభిమానులకు శుభవార్త.. వీర సింహారెడ్డి నుండి మొదటి పాట..!

Divya
నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలయ్య..  ఒకపక్క సినిమాలు చేస్తూనే.. మరోపక్క రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఇంకొక వైపు  బుల్లితెర షోలు చేస్తూ మరింత యాక్టివ్ గా దూసుకుపోతున్నారు. యుక్తవయసులో ఉన్నప్పుడు కేవలం సినిమాలు , రాజకీయాలకే తన కెరీర్ ను  పరిమితం చేసిన బాలయ్య.. ఇప్పుడు పలు షోలు కూడా చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నాడు . ఆరు పదుల  వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా తన జోష్ చూపిస్తూ కొత్త హీరోలకు సైతం ఆశ్చర్యం కలిగిస్తున్నారు.
ఇదిలా వుండగా సీనియర్ హీరోలు ఇటీవల ఒక్క బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడానికి ముప్పు తిప్పలు పడుతుంటే .. బాలకృష్ణ మాత్రం సింగిల్ హ్యాండ్ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాడు.  ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో విదేశాలలో సైతం కలెక్షన్లు సునామీ సృష్టించిన బాలయ్య..  ఇప్పుడు క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాను చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరొకసారి మాస్ ప్రభంజనం సృష్టించనున్నారు బాలయ్య.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.  మరి ఈ సినిమా నుంచి పాటలు ఎప్పుడు విడుదలవుతాయని అందరూ ఎదురు చూస్తూ ఉండగా.. బాలయ్య అభిమానులకు ఒక మంచి గుడ్ న్యూస్ అందించింది చిత్ర బృందం.  ఈ వారంతంలోగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. మొత్తానికి అయితే వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య తన ఖాతాలో మరో విజయాన్ని పొందబోతున్నట్లు తెలుస్తోంది .  ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక యాక్షన్ మూవీని చేయబోతున్నారు బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: