వైష్ణవిని ఎందుకు తీసుకున్నావ్ అన్నారు.. సినిమా చూశాక వారికి ఆన్సర్ దొరుకుతుంది..!

shami
జూనియర్ దేవరకొండ ఆనంద్ హీరోగా సాయి రాజేష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బేబీ. ఎస్.కె.ఎన్ నిర్మించిన ఈ సినిమాలో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ కాగా టీజర్ మాత్రం సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేసింది. యూత్ ఆడియన్స్ కావాల్సిన లవ్ ఎమోషన్ ఈ మూవీలో ఉంది. వైష్ణవీ చైతన్య ఈ సినిమాలో డీ గ్లామర్ గా ఒక ఛాలెంజింగ్ రోల్ చేసింది. అయితే ఈ మూవీ టైం లో హీరోయిన్ ని వెతుకుతున్న సందర్భంలో ఒకరిద్దరిని చూసి వైష్ణవి చైతన్యని ఫిక్స్ చేశారట. అయితే చాలామంది ఆమె అనేసరికి ఆమె వెబ్ సీరీస్ యాక్టర్ కదా.. షార్ట్ ఫిల్మ్ యాక్టర్ కదా అని అన్నారట.
అంతేకాదు సాయి రాజేష్ కి ఆమెని తొలగించాలని చాలా మంది చెప్పారట. అయినా కూడా సాయి రాజేష్ మొండి పట్టుతో ఆమెని తీసుకున్నారు. ఇక ఫైనల్ అవుట్ పుట్ చూశాక తన నిర్ణయం కరెక్ట్ అని అనుకున్నారు సాయి రాజేష్. ఈ సినిమా రిలీజ్ తర్వాత వైష్ణవిని వద్దన్న వారికి ఆన్సర్ దొరుకుతుందని అంటున్నారు దర్శకుడు సాయి రాజేష్. క్యూట్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా టీజర్ తోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మరి వెబ్ సీరీస్ చేసినంత మాత్రాన హీరోయిన్ గా పనికిరారా లేక వెబ్ సీరీస్ లు మాత్రమే తీసుకుంటూ ఉండాలా అని కొందరు అంటున్నారు.
సాయి రాజేష్ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే. ఆనంద్, వైష్ణవిల జోడీ చాలా బాగుంది. సినిమాలో వైష్ణవి డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. దొరసాని సినిమాతో తెరంగేటృఅం చేసిన జూనియర్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. అన్నలా మాస్ యాక్షన్ అని కాకుండా కుర్రాడు ఫ్యామిలీ యూత్ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తున్నాడు. తప్పకుండా ఆనంద్ కి ఈ మూవీ మరో హిట్ సినిమా అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: