కొరటాల శివకు అతను సెంటిమెంటా..?

Divya
డైరెక్టర్ కొరటాల శివ టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. కొరటాల శివ కెరియర్ లో మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత మహేష్ తోనే భరత్ అనే నేను చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. దీంతో ఫ్లాపు లేని డైరెక్టర్ గా పేరు పొందారు. కానీ చిరంజీవితో ఆచార్య సినిమా తెరకెక్కించి భారీ డిజాస్టర్ ని చవిచూశారు. ఆ తర్వాత కొరటాల శివ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి 30వ సినిమాని తెరకెక్కించేందుకు పలు సన్నహాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఆచార్య సినిమాకి ముందు వరకు అన్ని సినిమాలలో దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. కానీ అనూహ్యంగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకి మణిశర్మని తీసుకురావడం జరిగింది. అయితే వాస్తవానికి కొరటాల శివ దేవిశ్రీప్రసాద్ ని కొనసాగించాలని భావించారట.  కాని చిరంజీవి మాట కాదనలేక మణిశర్మని ఈ చిత్రానికి సంగీతాన్ని అందించవలసి వచ్చిందట. అప్పటికే చిరంజీవికి ఎన్నో మ్యూజిక్ హిట్లు ఇచ్చిన సెంటీమీటర్ తోనే చిరంజీవి అలా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఈసారి కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు.  తాజాగా ఎన్టీఆర్ 30వ చిత్రానికి కూడా కొరటాల శివ సెంటిమెంట్ ని ఈ హీరో లైట్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని అందించబోతున్నట్లు వార్తలు వినిపించాయి.  ముందుగా ఈ చిత్రానికి కూడా దేవిశ్రీప్రసాద్ అని అనుకున్నారు.  కానీ పాన్ ఇండియా చిత్రం కావడంతో పలు కారణాల చేత దేవిశ్రీప్రసాద్ స్థానంలో అనిరుద్ వచ్చినట్లుగా సమాచారం. ఇందులో ఎన్టీఆర్ ప్రమేయం ఎక్కువగా ఉందని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇక కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమాకి కూడా అనిరుద్ మ్యూజిక్ బాగా ఉండడంతో తన సినిమాకి కూడా అలాగే ఉండాలని భావించి ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మొత్తానికైతే కొరటాల శివకు అనిరుద్ సెంటిమెంటుగా మారాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: