రవితేజ "టైగర్ నాగేశ్వరరావు" మూవీలో ఆ సన్నివేశం హైలెట్ అంట..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన  టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో రేణు దేశాయ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.

రేణు దేశాయ్ ఈ మూవీ లో హేమలత లవణం అనే పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్ర ఈ మూవీ కి హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ప్రస్తుతం ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ఇంట్రవెల్ సన్నివేశం చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు , ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశం దగ్గర రవితేజ కు సంబంధించిన ఒక అద్భుతమైన ట్విస్ట్ రివెల్ కానుంది అని , ఆ ట్విస్ట్ ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై రవితేజ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మాస్ మహారాజ రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ధమాకా మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: