"ఓటిటి" లో సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న "గాడ్ ఫాదర్" మూవీ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన గాడ్ ఫాదర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , టాలీవుడ్ ప్రామిసింగ్ నటుడు సత్య దేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది.

ఈ మూవీ మలయాళం లో సూపర్ హిట్ అయినటు వంటి లూసీఫర్ మూవీ కి తెలుగు రీమిక్ గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ను తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకున్న గాడ్ ఫాదర్ మూవీ గత కొన్ని రోజుల నుండి ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ మూవీ కి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి"  ప్లాట్ ఫామ్ లో ప్రస్తుతం అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. గాడ్ ఫాదర్ మూవీ తెలుగు వర్షన్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 3 వ స్థానంలో కొనసాగుతూ ఉండగా ,  హిందీ వర్షన్ ప్రస్తుతం 1 వ స్థానంలో కొనసాగుతోంది. ఇలా ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  మంచి ప్రేక్షకు ఆదరణ పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: