"షేహజాదా" మూవీ టీజర్ వచ్చేసింది..!

Pulgam Srinivas
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంఠపురంలో అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజ హెగ్డే , అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించగా నివేదా పేత్ రాజ్ , సునీల్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. 12 జనవరి 2020 వ సంవత్సరం విడుదల అయిన అలా వైకుంఠపురంలో సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. అలాగే అలా వైకుంఠపురంలో సినిమాకు అద్భుతమైన కలెక్షన్ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయి.

ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కు పూజా హెగ్డే కు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ సినిమా విజయంలో ఎస్ ఎస్ తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇలా తెలుగు లో విడుదల అయిన అలా వైకుంఠపురంలో సినిమా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ గా నిలిచి అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేయడంతో ఈ సినిమాను హిందీ లో ప్రస్తుతం రీమిక్ చేస్తున్నారు. అలా వైకుంఠపురంలో సినిమాను హిందీ లో షేహజాదా అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ఈ మూవీ లో హీరోగా నటిస్తూ ఉండగా , కృతి సనన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

రోహిత్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. గుల్షన్ కుమార్ మరియు అల్లు అరవింద్ ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు హిందీ ప్రేక్షకుల నుండి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: