"చంద్రముఖి 2" మూవీలో కంగనా రనౌత్..?

Pulgam Srinivas
కొరియోగ్రాఫర్ గా  నటుడి గా , దర్శకుడి గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ తెలుగు మరియు తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో పాటలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా , ఎన్నో సినిమా లలో నటించి , ఎన్నో సినిమా లకు దర్శకుడు గా వ్యవహరించి తెలుగు , తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ "కాంచన" మూవీ సిరీస్ ల ద్వారా అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాఘవ లారెన్స్ "చంద్రముఖి 2" మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. చంద్రముఖి 2 మూవీ కి పి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే. .. చంద్రముఖి 2 మూవీ లో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనాథ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించ బోతున్నట్లు , కంగనా రనౌత్ పాత్ర ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  

ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. చంద్రముఖి మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో చంద్రముఖి 2 మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఎలా ఉంటే చంద్రముఖి మూవీ లో సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరో గా నటించిన ప్రభు , జ్యోతిక , నయన తార ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చంద్రముఖి మూవీ ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కలెక్షన్ ల వర్షాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కురిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: