అప్పుడు వెండితెరపై.. ఇప్పుడు బుల్లితెరపై.. హవా నడిపిస్తున్న హీరోయిన్లు?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన వారు.. ఆ తర్వాత కాస్త వయసు పెరగడం ఇక ఇండస్ట్రీలోకి యువ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో ఇక అవకాశాలు లేక కనుమరుగు అవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇండస్ట్రీలో ఎప్పుడు సర్వసాధారణమే. అయితే ఇలా అవకాశాలు లేక హీరోయిన్లుగా కనుమరుగు  వారు ఆ తర్వాత కొన్ని నెలలకి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఏదో ఒక విధంగా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటారు అన్న విషయం తెలిసిందె. అయితే మొన్నటి వరకు ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే హీరోయిన్లు కేవలం వెండితెరపై మాత్రమే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపించేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది ఒకప్పటి స్టార్ హీరోయిన్లు బుల్లితెరపై కూడా అరంగేట్రం చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తూ ఉండడం చూస్తూ ఉన్నామూ. ఇక అలాంటి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
 రాశి  : ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా హవా నడిపించింది. ఎంతో మంది హీరోలతో జతకట్టి సూపర్ హిట్ లు సాధించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా జ్ఞానాంబ అనే పాత్రలో ప్రేక్షకులను అలరిస్తోంది.
 కస్తూరి శంకర్ : ఒకప్పుడు హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించింది. ముఖ్యంగా స్టార్ హీరో నాగార్జున సరసన అన్నమయ్య సినిమాలో నటించి ఆకట్టుకుంది.  ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో తులసి అనే ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
 ఆమని : ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. శుభలగ్నం, మావిడాకులు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై  అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ముత్యమంతా ముగ్గు అనే సిరియల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
 ప్రభ : ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో టాప్ హీరోయిన్గా కొనసాగిన ప్రభ తన హవా నడిపించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపై ప్రసారమవుతున్న కలిసి ఉంటే కలదు సుఖం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: