ఈ రోజే NC22 ఫస్ట్ లుక్ పోస్టర్..!

Divya
తాజాగా అక్కినేని నాగచైతన్య, వెంకట ప్రభూ దర్శకత్వంలో తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా రెండు నెలల క్రితమే సినిమా సెట్ పైకి వెళ్ళింది. అయితే ప్రస్తుతం NC22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు కొనసాగుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా నాగచైతన్య కెరియర్ లో అత్యంత భారీ చిత్రాలలో ఈ ప్రాజెక్టు కూడా ఒకటి కావడం గమనార్హం. అద్భుతమైన సాంకేతిక విభాగం.. తారాగణం ప్రకటనతో ఈ చిత్రం భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ స్టాండింగ్ లుక్ లో అభిమానులకు, అటు సినీ ప్రేమికులకు సర్ప్రైజ్ ఇస్తూ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ లో ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. ఈ ప్రీ లుక్ పోస్టర్ చూసినట్లయితే నాగచైతన్య తోటి అధికారుల చేతుల్లో లాక్ చేయబడినట్లు కనిపిస్తున్నాడు.. అతని ఆవేశాన్ని అదుపు చేయడానికి తుపాకీలను కూడా గురిపెట్టడం మనం గమనించవచ్చు.  ఈ ఇంటెన్స్ లుక్ ఫస్ట్ లుక్ పై అంచనాలను పెంచేసింది.  ఇకపోతే నవంబర్ 23 అనగా ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు కావడంతో 10:30  గంటలకు చైతన్య పుట్టినరోజు సర్ప్రైజ్ గా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయబోతున్నారు.
ఈ పోస్టర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ..ఈ చిత్రానికి దిగ్గజ తండ్రి కొడుకులు.. సంగీత ధ్వయం అయిన యువన్ శంకర్ రాజా.. ఇసైజ్ఞాని ఇళయరాజా సంగీతం అందిస్తుండడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి.  ఇక ఇందులో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు ప్రియమణి, అరవిందస్వామి,  ప్రేమ్జీ అమరన్ , ప్రేమీ విశ్వనాథ్ , సంపత్ రాజ్ , వెన్నెల కిషోర్ , శరత్ కుమార్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: