బేబీ టీజర్ తో యూట్యూబ్ షేక్ అవుతుంది..!

shami
ఓ సినిమా టీజర్ రిలీజ్ కాగానే మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి అంటే అది కచ్చితంగా స్టార్ సినిమా అయ్యుంటుంది. ఆ స్టార్ అభిమానులు టీజర్ రిలీజ్ అవడమే ఆలస్యం రిపీట్ మోడ్ లో చూస్తుంటారు. అయితే యువ హీరో టీజర్ అలా చూడాలంటే టీజర్ లో చాలా మ్యాటర్ ఉండాలి. ప్రస్తుతం అలాంటి ఓ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంటుంది. అదే ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ. జూనియర్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన సినిమా బేబీ. సాయి రాజెష్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీని మారుతి, ఎస్.కె.ఎన్ కలిసి నిర్మించారు.
రీసెంట్ గా రిలీజైన ఈ బేబీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఓ సూపర్ క్యూట్ లవ్ స్టోరీగా ఈ బేబీ వస్తుంది. టీజర్ తోనే సినిమాపై ఓ పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశాడు డైరక్టర్ సాయి రాజేష్. బేబీ టీజర్ లో అంతగా ఏముంది అంటే ఓ అమ్మాయి తన క్లాస్ రూం లోని అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆమె నల్లగా.. అతను తెల్లగా ఉంటాడు. అయితే ఆమె ప్రేమని అర్ధం చేసుకున్న ఆ హీరో ఇక్కడనుంచి మన ప్రేమ కథ మొదలైంది అనేస్తాడు. ఇంతకీ ఈ ప్రేమ కథ ఎలా కొనసాగింది. ఎలా ముగిసింది అన్నది బేబీ సినిమాలో చూడాల్సిందే.
షార్ట్ ఫిలంస్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన వైష్ణవి చైతన్య ఈ మూవీతో సిల్వర్ స్క్రీన్ పై తన ముద్ర వేసుకునేలా ఉంది. బేబీలో పూర్తిగా డీ గ్లామర్ రోల్ లో ఆమె నటన సూపర్ గా ఉంది. ఆనంద్ దేవరకొండకు కూడా ఈ మూవీ చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఫైనల్ గా బేబీ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో మ్యూజిక్ కూడా హృదయానికి హత్తుకునేలా ఉంది. మరి బేబీ ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: