కాంతార: ఓటిటి రిలీజ్.. ఉన్నట్టా? లేనట్టా?

Purushottham Vinay
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఇండియన్ సినిమాల్లో కాంతార సినిమా కూడా ఒకటి. అసలు ఎటువంటి అంచనాలు లేకుండ వచ్చి ఈ సినిమా దేశావ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది.కన్నడ సినిమాగా తెరకెక్కిన కాంతారా సినిమా అన్ని భాషలకు అతీతంగా ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ అందుకుంది.నటుడు రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా చేసిన కాంతార గత నెల 15న తెలుగులో విడుదల అయ్యింది. అంతకంటే ముందే కన్నడలో విడుదలై చాలా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా దాదాపు 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా 300కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే థియేటర్స్ లో ఈసినిమా బాగా సందడి చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో రానుందని గత కొద్దిరోజలుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అన్నదాని పై ఇప్పటిదాకా ఇంకా క్లారిటీ రాలేదు.


ఈ మధ్య నవంబరు 24న 'కాంతార' సినిమా వచ్చేస్తుందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్లు బాగా వైరల్ అయ్యి హల్ చల్ చేశాయి. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్వయంగా ప్రకటించినట్లు కొన్ని పోస్టర్స్ ను డిజైన్‌ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని సమాచారం తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఇంతవరకు ఈ విషయాన్నీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే కాంతారా సినిమా స్ట్రీమింగ్‌ గురించి 'అమెజాన్‌ హెల్ప్‌'ను అడగ్గా నవంబరు 24న అంటూ సమాధానం ఇచ్చింది. అయితే, అధికారిక పేజీలో మాత్రం ఎలాంటి ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వచ్చేవారం ఈ సినిమా ఓటిటిలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: