హిట్ 2 ట్రైలర్ లాంచ్ అప్పుడే..!

Divya
శైలేష్ కొలను దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం హిట్.. థ్రిల్లర్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే మంచి సక్సెస్ అందుకొని దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలను వసూలు చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2020 ఫిబ్రవరి 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అందరూ హిట్ 2 ఎప్పుడు వస్తుంది అని తెగ ఆత్రుతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు త్వరలోనే హిట్ 2 సినిమా విడుదల చేయబోతున్నామని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచింగ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు.

అయితే ఈసారి భిన్నంగా అదే హీరోని కాకుండా యాక్షన్ థ్రిల్లర్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యంగ్ హీరో అడవి శేషు తో ఈ సినిమా చేయడానికి డైరెక్టర్ శైలిష్ కొలను ఆలోచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిట్ 2 సినిమాలో ఈసారి విశ్వక్ సేన్ ను కాకుండా అడవి శేషుని మనం చూడవచ్చు. ఇకపోతే రేపు మధ్యాహ్నం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారు.  ఇప్పటికే టీజర్ విడుదల చేయగా అందులో ఆద్యంతం అడవి శేషు ప్రేక్షకులను ఆకట్టుకున్న తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు.  దీంతో ఈ సినిమాపై  అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

మరి అడవి శేషు హిట్ 2 సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని అందిస్తారో తెలియాల్సి ఉంది.  త్వరలోనే హిట్ 3 సినిమా కూడా చేస్తామని.. ఆ విషయాన్ని హిట్ 2  సినిమా క్లైమాక్స్ లో రివీల్ చేయబోతున్నారు. మరొకవైపు ఈ సినిమాను హిందీలో కూడా డబ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిట్ 3 సినిమాకి కూడా కొత్త హీరోని పరిచయం చేయబోతున్నారు డైరెక్టర్.  మరి ఈ ముగ్గురికి హిట్ సినిమా మంచి సక్సెస్ అందిస్తుందనే చెప్పవచ్చు.  ఎందుకంటే హిట్ సినిమా ద్వారా విశ్వక్ సేన్ ఎలాగో విజయాన్ని సొంతం చేసుకున్నారు.  మరి హిట్ 2 సినిమా కూడా అడవి శేష్ కు విజయాన్ని అందించేలా కనిపిస్తోంది. ఆ తరువాత హిట్ 3  తో ఏ హీరో వస్తాడో.. అతడికి ఏ విధంగా విజయం వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: