అర్జున్ రెడ్డి చిత్రంలో అవకాశం అలా వచ్చిందంటున్న కమెడియన్..!!

Divya
తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ బాగా సుపరిచితమే.  మొదట షార్ట్ ఫిలింల ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత వెండితెర పైన పలు చిత్రాలలో నటించే బాగానే పేరు సంపాదించారు. అటు తర్వాత అంచలంచెలుగా కమెడియన్గా ఎదుగుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ . ఈయన నటించిన అర్జున్ రెడ్డి , జాతి రత్నాలు సినిమాలతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు.ఈ సినిమాలో విభిన్నమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే పెంచుకున్నారు.

ఇక విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడు పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోకి సమానమైన క్రేజీ సంపాదించుకున్నారని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత రాహుల్ రామకృష్ణ టాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న కమెడియన్లలో ఒకరని కూడా చెప్పవచ్చు. తాజాగా ఒక టాక్ షో లో పాల్గొన్న రామకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేశారు.

రామకృష్ణ మాట్లాడుతూ.. తన పుట్టింది పెరిగింది అంతా కేవలం హిమాయత్ నగర్ లోనే అని తెలియజేశారు. తన కుటుంబంలో ఎవరికీ కూడా సినిమా ప్రపంచంతో సంబంధం లేదని,  నేను , తరుణ్ భాస్కర్ , విజయ్ దేవరకొండ,  ప్రియదర్శి అందరం ఒకేసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాము.. పెళ్లిచూపులు సినిమాకి ముందు మేమందరం సినిమాలలో ప్రయత్నాలు చేసే వాళ్ళమని అదే సమయంలో తరుణ్ భాస్కర్ కి పెళ్లిచూపులు సినిమా చేసే అవకాశం వచ్చింది. అందులో విజయ్ దేవరకొండ హీరోగా ముందు అనుకున్నాము. అతని ఫ్రెండు పాత్రకి తరుణ్ భాస్కర్ ప్రియదర్శికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు విజయ్ దేవరకొండ తో డైరెక్టర్ సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాను అనుకోకుండా తెరకెక్కించారని తెలియజేశారు . ఆ విధంగా ఆ చిత్రంలో శివ పాత్రలో నటించే అవకాశం తనకి వచ్చిందని తెలిపారు రాహుల్ రామకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: