విజయ్... లోకేష్ కనకరాజు మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు సందీప్ కిషన్ , రెజీనా ప్రధాన పాత్రలలో తేరకెక్కిన మా నగరం అనే మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఖైదీ మూవీ తో ఈ దర్శకుడు బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు విక్రమ్ మూవీ కి దర్శకత్వం వహించాడు.

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన ఖైదీ మరియు విక్రమ్ మూవీ లతో లోకి యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. ఇది ఇలా ఉంటే విక్రమ్ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో లోకేష్ కనకరాజు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని దళపతి విజయ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కూడా లోకి యూనివర్సిటీ సంబంధించిందా ... కాదా ... అనే ప్రశ్నలు ఇన్ని రోజుల పాటు తలెత్తాయి. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాలతో నటుడు నరైన్ మాట్లాడుతూ ...  లోకేష్ కనకరాజు ,  విజయ్ తో చేయబోయే సినిమా కూడా లోకి సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే అని ,   తాను ఈ మూవీ లో ఉండను కానీ ఖైదీ 2 మూవీ లో మళ్ళీ కనిపిస్తానని తాను చెప్పాడు. ఇలా దళపతి విజయ్ , లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లోకి యూనివర్సిటీ కి సంబంధించిందే అని స్పష్టం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: