బిగ్ బాస్ 6 : ఆమెకి టాప్ 5 బెర్త్ కన్ ఫర్మ్ చేసిన ఆడియన్స్..!

shami
బిగ్ బాస్ సీజన్ 6 లో కీర్తి శెట్టి టాప్ 5 బెర్త్ కన్ ఫర్మ్ అయినట్టే అని చెప్పొచ్చు. 11 వారాలు పూర్తి చేసుకున్న సీజన్ 6 లో లేటెస్ట్ గా మెరినా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. రోహిత్, మెరినా జోడీగా హౌస్ లోకి రాగా ఐదారు వారాల వరకు ఇద్దరు ఒకే కంటెస్టంట్ గా ఆడారు. ఆ తర్వాత ఇద్దరిని వేరుగా బిగ్ బాస్ ఆడమని చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరు ఇండివిడ్యువల్ గేం ఆడుతూ వస్తున్నారు. ఫైనల్ గా 11వ వారం హౌస్ నుంచి మెరినా ఎలిమినేట్ అయ్యింది. మొదట్లో కేవలం ఒంట గదికే పరిమితమైన మెరినా ఈమధ్య టాస్కులు కూడా బాగా ఆడుతూ వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే స్ట్రాగ్ అవుతుంది అనుకున్న టైం లో మెరినా ఎలిమినేట్ అయ్యింది.
ఆమె ఎలిమినేట్ అయిన సందర్భంగా ఆమె భర్త రోహిత్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక మరోపక్క కీర్తి కి సింపతీ ఓట్లు పడుతూనే ఉన్నాయి. ఓ యాక్సిడెంట్ లో ఫ్యామిలీని మొత్తం కోల్పోయిన కీర్తి తన పరిస్థితి అందరిని కదిలించింది. అలా కీర్తి కి కొంతమంది ఓట్స్ వేస్తూనే వస్తున్నారు. ఆట సరిగా ఆడకపోయినా కీర్తికి సింపతీ ఓట్లు బాగా పడుతున్నాయి. ఇక ఇదే ఫాం కొనసాగిస్తే మాత్రం కీర్తి టాప్ 5లో కూడా కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు. గత రెండు వారాలుగా కీర్తి చేతి వేలికి గాయం కారణం గా కొన్ని టాస్కులు ఆడలేకపోతుంది. అయితే తన ప్రయత్నం చేస్తుంది అన్న కారణంతో ఆడియన్స్ ఆమెకి ఓటు వేస్తున్నారు.
ఇలానే ఓటింగ్ కొనసాగితే కీర్తి తప్పకుండా టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. అయితే కేవలం తన మీద సింపతీ ఓట్లు పడుతున్నాయని మిగతా హౌస్ మెట్స్ కూడా గుర్తించే ఛాన్స్ ఉంటుంది. అందుకే కీర్తి టాస్కుల్లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఫైనల్ గా కీర్తి మాత్రం తనని తాను ప్రూవ్ చేసుకోవాలని బాగా ఉన్నా ఆమె ఆట సరిగా ఆడలేకపోయినా ఆమెకు ఓట్లు మాత్రం బాగానే పడుతున్నాయి. ప్రత్యేకంగా కీర్తి ఆట ఆడకపోయినా కొద్దిగా ఫైట్ ఇస్తే చాలు ఆమెని టాప్ 5 లో నిలబెట్టేలా ఉన్నారు ఆడియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: