బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచిన యశోద మూవీ..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ నటిమానులలో ఒకరు అయినటు వంటి సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. లేడి ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కిన యశోద సినిమాకి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేష్ , మురళి శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్ర లలో నటించారు. మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా యశోద మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న నేపథ్యం లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. యశోద మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 11.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. అలా 12 కోట్ల టార్గెట్ తో యశోద మూవీ నవంబర్ 11 వ తేదీన తెలుగు , తమిళ , మలయాళ , హిందీ , కన్నడ భాషలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించడం తో యశోద మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభించాయి. దానితో ఈ మూవీ 9 రోజుల్లో 12 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి కూడా యశోద మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: