ట్రైలర్: వామ్మో ఆర్జీవి డేంజరస్ అందాలు అదరహో..!!

Divya
టాలీవుడ్లో సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో పలు బోల్డ్ చిత్రాలను తెరకెక్కిస్తే ఉన్నారు. ముఖ్యంగా తాను తెరకెక్కించే సినిమాలు యువతను బాగా అట్రాక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. వర్మ తెరకెక్కించిన డేంజరస్ సినిమా ఎప్పుడో షూటింగ్ అయిపోయిన ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు. ముఖ్యంగా వర్మ కంటెంట్తో సంబంధం లేకుండా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజును విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ ట్రైలర్లు ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ వర్మ చాలా హైలైట్ గా తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. హీరోయిన్లుగా నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లుగా నటించారు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి.. అలా చిగురించిన ప్రేమ మధ్య వీరిద్దరూ ఎదుర్కొన్న కష్టాలు, పురుషాధిక్య ప్రపంచంలో ఈ ఇద్దరు మహిళలు ఎలా వేధించబడ్డారు అన్న కథాంశంతో తెరకెక్కించారు. ఇక ఇందులోనే క్రైమ్ రొమాన్స్ సస్పెన్స్ ఇలా కొన్ని విభిన్నమైన నేపథ్యాల బేస్ లో తీసుకురావడం జరిగింది ఈ సినిమా గురించి వర్మ తనదైన స్టైల్ లో స్పందించారు.
డేంజర్ సినిమా తనలో ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తున్నదని ఇంతవరకు ఇలాంటి సినిమాలు చేయలేదని ఇలాంటి జోన్ తను ఎప్పుడు టచ్ చేయలేదని నా మొదటి ప్రయత్నం ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథని భిన్నంగా మలిచామని తెలియజేశారు. హీరోలు డేట్లు దొరకపోయిన హీరోయిన్లతో కూడా ఇలాంటి సినిమాలు చేయవచ్చని రుజువు చేస్తున్నాను అంటూ తెలిపారు. అలాగే ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసే సినిమాల ఉంటుందా అని ఒక ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు వర్మ ఫ్యామిలీ అంతా ఒకేసారి థియేటర్కు ఎందుకు రావాలి ఒక్కొక్కరుగా వచ్చి చూడొచ్చు అంటూ తనదైన స్టైల్ లో చమత్కరించారు వర్మ. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: