బాలీవుడ్ లో రష్మికకి ఊహించని షాక్?

Purushottham Vinay
కన్నడ బ్యూటీ రష్మిక మందన.. ఈ బ్యూటీ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు నార్త్ లోను ఏ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది.ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకెళ్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అటుపై టాలీవుడ్‌లో కూడా ఈమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది.ఇక అలాగే ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా ఈ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకుపోతూ బాగా దుమ్ములేపుతోంది.రష్మిక ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా రష్మిక మందన తెలిపింది. తన చిన్నతనంలో స్కూల్ డేస్‌లో ఆర్థికంగా తన కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లుగా రష్మిక తెలిపింది. తన తండ్రి తనకు బొమ్మలు కొనిచ్చే స్థాయిలో కూడా లేడని రష్మిక బాధపడేదట. ఇక ఇంటి అద్దె కట్టేందుకు కూడా ఒక్కోసారి డబ్బులు లేకపోవడంతో, తరుచూ ఇళ్లు కూడా మారేవారట. 


తన తండ్రికి ఆదాయం కూడా సరిగ్గా లేకపోవడంతో తమ కుటుంబం చాలా కష్టాలను చవిచూశామని రష్మిక మందన తెలిపింది.అందుకే తనకు ప్రతి రూపాయి విలువ తెలుసని, అందుకే డబ్బును వృథా చేయకుండా ఆదా చేసేవాళ్లంటే తనకు నచ్చుతారని రష్మిక పేర్కొంది.రష్మిక మందన ఇటీవల గుడ్ బై సినిమాతో బాలీవుడ్ డెభ్యు ఇచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విధంగా ప్లాప్ అయ్యింది.ఈ దెబ్బతో రష్మిక మరో బాలీవుడ్ సినిమాకి సైన్ చెయ్యలేదు.ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఇంకా అలాగే విజయ్ హీరోగా వస్తున్న వారిసు సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద విజయాలు సాధిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: