కేవలం ఆ ఒక్క మీ పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్న నాని..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే ఎన్నో మంచి విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా తన కంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం నాని "అంటే సుందరానికి" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా ,  మలయాళ ముద్దుగుమ్మ నజరియా ఈ మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన అంటే సుందరానికి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని "దసరా" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉండగా , కీర్తి సురేష్ ఈ మూవీ లో  నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ ఈ మూవీ లో ప్రతి నాయక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే దసరా మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే నాని ప్రస్తుతం దసరా మూవీ లో మాత్రమే నటిస్తున్నాడు.  అలాగే వేరే ఇతర ప్రాజెక్ట్ లను కూడా ఓకే చేయడం లేదు.

ప్రస్తుతం నాని కేవలం ఒక్క దసరా మూవీ పైనే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. నాని నటిస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి దసరా మూవీ తో నాని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: