ఆ మూవీ నుండి తప్పుకుంటున్నాను... అమీర్ ఖాన్..!

Pulgam Srinivas
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమీర్ ఖాన్ ఇప్పటికే తాను నటించిన అనేక బ్లాక్ బస్టర్ మూవీ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే అమీర్ ఖాన్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు మూవీ లో కూడా నటించక పోయినప్పటికీ అమీర్ ఖాన్ నటించిన హిందీ మూవీ ల ద్వారానే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆమీర్ ఖాన్ ఆఖరుగా దంగల్ మూవీ తో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా భారీ కలెక్షన్ లను రాబట్టింది. తాజాగా అమీర్ ఖాన్ "లాల్ సింగ్ చడ్డ" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఆ కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ మూవీ ని మెగాస్టార్ చిరంజీవి సమర్పించాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా మిస్టర్ పర్ ఫేక్ట్ అమీర్ ఖాన్ ఒక సంవత్సరం నర పాటు సినీ పరిశ్రమ కు దూరంగా ఉండబోతున్నట్లు తాజాగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 35 సంవత్సరాలుగా విరామం లేకుండా నటిస్తున్నాను అని , దానితో కుటుంబం తో గడిపే సమయాన్ని కోల్పోయానని అమీర్ ఖాన్ చెప్పాడు. అలాగే ఛాంపియన్స్ అనే మూవీ లో నటించాల్సి ఉన్నట్లుగా , కానీ ప్రస్తుతం చాంపియన్స్ మూవీ నుండి తప్పుకుంటున్నట్లు అమీర్ ఖాన్ ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: