వావ్:మళ్లీ ఆ హీరో నే నెంబర్ వన్..!!

Divya
టాలీవుడ్లో గడచిన కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా పాన్ ఇండియా చిత్రాల హవానే కొనసాగుతోందని చెప్పవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన సినిమా అంటే కేవలం బాహుబలి చిత్రమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తర్వాత వచ్చిన పుష్ప, rrr వంటి చిత్రాలు తెలుగు ఇండస్ట్రీని మరింత పైకి తీసుకువచ్చాయి. దీంతో తెలుగు హీరోలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో అక్టోబర్ నెలకు సంబంధించి తెలుగులో మోస్ట్ పాపులర్ హీరో ఎవరని ఓర్ మ్యాక్స్ మీడియా ఒక సర్వే ని నిర్వహించింది.
ఈ సర్వేలో మరొకసారి ప్రభాస్ నెంబర్ వన్ హీరోగా నిలవడం జరిగింది. గత కొంతకాలంగా తెలుగు హీరోలు కథల ఎంపిక కోసం సరికొత్త ఒరవడిని తీసుకువస్తున్నారు. అందుచేతనే కొత్త కొత్త కథలు తెరపైకి వస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోగా మరికొన్ని ఫ్లాప్ గా నిలిచాయి. ప్రముఖ మీడియా సంస్థ ఓర్ మ్యాక్స్ తెలుగులో మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్ ఎవరనే విషయాన్ని తెలియజేసింది ఇందులో నెంబర్ వన్ స్థానంలో ప్రభాస్ ఉండగా ,ఆ తర్వాత స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.
ఇక మూడవ స్థానంలో అల్లు అర్జున్ ,నాలుగవ స్థానంలో మహేష్ బాబు, ఐదవ స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో నిల్చగా ,నాని ఏడవ స్థానం విజయ్ దేవరకొండ, ఎనిమిది చిరంజీవి, తొమ్మిది వెంకటేష్ పదవ స్థానంలో నిలిచారు. కానీ ఇందులో బాలకృష్ణ ,నాగార్జున, రవితేజ వంటి హీరోలు చోటు దక్కించుకోలేకపోవడం అభిమానులకు చాలా నిరాశను కలిగిస్తోంది. ఇక ప్రభాస్ అభిమానులు ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉండడంతో కాస్త సంబరపడిపోతున్నారు. అయితే ఈ పొజిషన్లు అనేవి ప్రతినెల మారుతూ ఉంటాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: