సినిమాలకు ఫలితం లేని హిట్ టాక్ !

Seetha Sailaja

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ మొదలైనట్లు కనిపిస్తోంది. విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి మూడు రోజులు తప్ప ఆతరువాత హిట్ టాక్ వచ్చిన సినిమాకు కూడ కలక్షన్స్ పడిపోతు ఉండటంతో సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆలోచనలలో పడ్డాయి.

దసరా రేస్ కు విడుదలైన భారీ సినిమా ‘గాడ్ ఫాదర్’ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చింది. అప్పటికే ‘ఆచార్య’ షాక్ లో ఉన్న చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ కు వచ్చిన పాజిటివ్ టాక్ ను చూసి తెరిపిన పడ్డాడు. అయితే ఈమూవీకి మొదటివారం కలక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ రెండవ వారం నుండి కలక్షన్స్ డ్రాప్ అవ్వడంతో ఈసినిమాకు చిరంజీవి ఆశించిన ఫిగర్స్ రాలేదు అన్నప్రచారం జరుగుతోంది.

ఇక లేటెస్ట్ గా విడుదలైన సమంత ‘యశోద’ మూవీ పరిస్థితి కూడ ఇలాగే ఉంది అంటున్నారు. ఈమూవీకి కూడ టోటల్ పాజిటివ్ టాక్ వచ్చింది. దీనితో ఈమూవీ కనీసం 25 కోట్ల నెట్ కలక్షన్స్ తెచ్చుకుంటుంది అన్న అంచనాలు వచ్చాయి. అయితే ఈమూవీకి మొదటి మూడు రోజులు కలక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ సోమవారం నుండి ఈమూవీ కలక్షన్స్ భారీగా డ్రాప్ అవుతూ వస్తూ ఉండటంతో ఈమూవీ కనీసం బ్రేక్ ఈవెన్ అయినా అవుతుందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నట్లు టాక్.

రెండు వారాల క్రితం విడుదలైన అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు వచ్చిన టాక్ విని శిరీష్ ఏకంగా సక్సస్ మీట్ కూడా చేసుకున్నాడు. అయితే ఈమూవీ కూడ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని అంటున్నారు. గత రెండు నెలలుగా విడుదలైన సినిమాలలో ఒక్క ‘కాంతార’ తప్ప మరే సినిమా లాభాల బాట పట్టలేదు. దీనితో క్రిస్మస్ కు అదేవిధంగా సంక్రాంతికి విడుదల కాబోతున్న భారీ సినిమాల పై భారీ పెతుబడులు పెటిన నిర్మాతలు బయ్యర్లు తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: